హత్య, అత్యాచారం కన్నా..ఈ కాలంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. హత్య చేస్తే ఒకరో ఇద్దరో చనిపోతారు.. కానీ, సైబర్ మోసంలో చాలామంది బాధితులు చిక్కుకుంటారని తెలిపారు. మధ్యతరగతి, పేదలే సైబర్ నేరాళ్లకు గురవుతున్నారని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు.. మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control center)కు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డ్రగ్స్, సైబర్ నేరాలు(drugs& cyber crime) అని అన్నారు. విద్యార్థులు ఎక్కువగా గంజాయికి బానిసలు అవుతున్నారని రేవంత్ వెల్లడించారు.
హత్య, అత్యాచారం కన్నా..ఈ కాలంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. హత్య చేస్తే ఒకరో ఇద్దరో చనిపోతారు.. కానీ, సైబర్ మోసంలో చాలామంది బాధితులు చిక్కుకుంటారని తెలిపారు. మధ్యతరగతి, పేదలే సైబర్ నేరాళ్లకు గురవుతున్నారని వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి రేవంత్ పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే, ఈ ధరలను అమలు చేసేందుకు కూడా పలు కండిషన్లను పెట్టారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ నివారణకు ఇండస్ట్రీ తోడ్పడాలని అన్నారు. టికెట్ల ధరల పెంపు, షూటింగ్ అనుమతుల కోసం పలువురు ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ నివారణకు ఇండస్ట్రీ తోడ్పడాలని సూచించారు.
సినిమా విడుదలకు ముందు నటులతో డ్రగ్స్ నియంత్రణపై వీడియోలు తీయాలన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ నియంత్రణ అనే అంశంపై మెగాస్టార్ చిరంజీవి తప్ప ఎవరూ స్పందించలేదని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ వీడియోలు తీస్తేనే.. టికెట్ల ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. సినీ ఇండస్ట్రీ వందలకోట్లు సంపాదిస్తోందని తెలిపారు. సమాజానికి సినీ ఇండస్ట్రీ మేలు చేయాల్సిందే అని రేవంత్ స్పష్టం చేశారు.