ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందని మాజీ మంత్రి సినీ యాక్టర్ రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలపై
న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందని మాజీ మంత్రి సినీ యాక్టర్ రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలపై అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, కాలేజీ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి మరి పైసాచిక ఆనందం పొందుతున్నారని తెలియజేశారు.. నేరస్తులకు ఇంతటి ధైర్యం పెరిగిందంటే ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అని అన్నారు.
ఇంత పెద్ద ఘటన జరిగిన గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం మరింత దారుణమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పు చేయాలంటే భయపడిపోయేవారని అన్నారు. ముచ్చుమరిలో 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఇప్పటివరకు న్యాయం చేయలేదని తెలియజేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం సీఎం, హోం మంత్రి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
నేను ఏ పార్టీ మారడం లేదని పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలని అన్నారు. 2014 నుంచి 2019 మధ్యలో చాలా మంది పార్టీలు మారారని, దానివల్ల జగన్ కు జరిగిన నష్టం ఏమీ లేదని పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరు క్షమించరని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని అక్రమాలు జరుగుతున్నాయని, నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపిన ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయని, ఇక మహిళలకు అయితే భద్రత లేదని తెలియజేశారు. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదని, నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి రోజా తీవ్రంగా దుమ్మెత్తి పోశారు.