Camera:సీక్రెట్ కెమెరాలు..ఈ ట్రిక్స్ తో ఈజీగా గుర్తించొచ్చు.!

ప్రస్తుత కాలంలో ఎంతో టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీ ఎవరికైనా రెండు రకాలుగా పనిచేస్తుంది. కొంతమందికి టెక్నాలజీ మంచి పనులు చేస్తుంటే మరికొంతమందికి


Published Sep 02, 2024 07:32:00 AM
postImages/2024-09-02/1725240225_cc.jpg

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో ఎంతో టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీ ఎవరికైనా రెండు రకాలుగా పనిచేస్తుంది. కొంతమందికి టెక్నాలజీ మంచి పనులు చేస్తుంటే మరికొంతమందికి టెక్నాలజీ ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ టెక్నాలజీని మనం ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగానే ఫలితాలు ఉంటాయనేది మనం గమనించాలి. ముఖ్యంగా టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి సీక్రెట్ కెమెరాలనేవి ఎక్కువైపోయాయి. ఈ కెమెరాల వల్ల కొన్ని నేరాలు తగ్గిపోయిన కొన్ని నేరాలు మాత్రం పెరిగిపోతున్నాయి.  ముఖ్యంగా సీక్రెట్ కెమెరాల వల్ల కొన్ని కేసులను పోలీసులు చేదిస్తున్నారు.

 కానీ కొంతమంది ఆ కెమెరాలను తప్పుడు పనులకు ఉపయోగించి పోలీసులకు పట్టుబడుతున్నారు. మరి చిన్న సీక్రెట్ కెమెరాలను మనకు తెలియకుండా కొన్ని ప్రైవేటు పేసుల్లో పెట్టి మన ప్రైవేట్ వీడియోలను తీస్తూ బ్లాక్మెయిల్ లకు గురిచేస్తున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. ఇందులో గుడ్లవల్లేరు  ఘటన కూడా ఒకటి.  మరి అలాంటి ఈ తరుణంలో ఎక్కడైనా బాత్రూంలలో లేదా హోటల్లలో సీక్రెట్  కెమెరాలు ఉన్నాయా లేదా అనేది ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు ఏదైనా తెలియని ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు గదిలో ముందుగా గడియారాలు ల్యాంపులు, పవర్ బ్యాంకులు, పెన్నులు, ఫోటో ప్రేములు యుఎస్బి డ్రైవులు, బొమ్మలు వంటివి నిశితంగా పరిశీలించాలి. ముందుగా మీ గదిని మొత్తం చీకటిగా ఉంచి మీ ఫోన్ లైట్ ద్వారా చుట్టూ చూడండి. దీనివల్ల హిడెన్ కెమెరాలు ఉంటే  మీ ఫోన్ లైట్ దాని మీద పడ్డప్పుడు మెరుస్తుంది. దీని ద్వారా ఆ కెమెరాలను గుర్తించవచ్చు. ముఖ్యంగా హీడెన్ కెమెరాలను గుర్తించే యాప్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. వాటిని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి. కొన్ని సీక్రెట్ కెమెరాలు పనిచేయాలంటే బ్లూటూత్ ఆన్ చేసి ఉంచాలి.

 అలాంటి టైంలో మనం మన ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ ఏదైనా యాక్టివేట్ అయి ఉంటే అది మనకు కనిపిస్తుంది దాని ద్వారా మనం సీక్రెట్ కెమెరాలను కనిపెట్టవచ్చు. అంతేకాకుండా కొన్ని సీక్రెట్ కెమెరాలు వైఫై ద్వారా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్న వైఫై ఆఫ్ చేయడం ద్వారా కూడా సీక్రెట్ కెమెరాలు కనిపెట్టవచ్చు. మరి ముఖ్యంగా  ఈ గదిలో సీక్రెట్ కెమెరాలు ఉంటే మీరు ఎవరికైనా ఫోన్ చేయడం ద్వారా కనిపెట్టవచ్చు. ఈ టైంలో మీరు ఏదైనా శబ్దం లేదంటే వైబ్రేషన్ వినిపిస్తే గదిలో సీక్రెట్ కెమెరా ఉందని అర్థం చేసుకోవాలి.  ఈ విధంగా గదిలో సీక్రెట్ కెమెరాలను  ఈజీగా కనిపెట్టవచ్చు.

newsline-whatsapp-channel
Tags : news-line cctv secret-camera girls-hostel bluetooth wifi-connection hotal-rooms

Related Articles