Secretariat : కులం పేరుతో బండబూతులు.. సెక్రటేరియట్ వర్కర్ల ఆందోళన

మేం చెప్పినట్టు వినాలె. లేకపోతే నీకు జాబ్ ఉండదు. ఏం నకరాల్ చేస్తున్నవా? అంటూ కులం పేరుతో తెలంగాణ సెక్రటేరియట్ ల పనిచేసే మహిళలను తిడుతున్నారని వారు ఆందోళనకు దిగారు.


Published Aug 05, 2024 07:11:24 PM
postImages/2024-08-05/1722865284_secretariatsweepers.jpg

న్యూస్ లైన్ డెస్క్ : మేం చెప్పినట్టు వినాలె. లేకపోతే నీకు జాబ్ ఉండదు. ఏం నకరాల్ చేస్తున్నవా? అంటూ కులం పేరుతో తెలంగాణ సెక్రటేరియట్ ల పనిచేసే మహిళలను తిడుతున్నారని వారు ఆందోళనకు దిగారు. సెక్రటేరియట్ స్వీపర్లు, హౌజ్ కీపింగ్ పనులు చేసే మహిళలు తమను కాంట్రాక్టర్, సూపర్ వైజర్ నోటికొచ్చినట్టు తిడుతున్నారని నిరసనకు దిగారు. కులం పేరుతో బండ బూతులు తిడుతున్నారని వాపోయారు.

 

ఉద్యోగాలు తొలగిస్తామని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ వైజర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబ్బంది ఆందోళనతో దిగి వచ్చిన ఉన్నతాధికారులు కాంట్రాక్టరును సంప్రదించేందుకు ప్రయత్నించగా కేవీఆర్ యాజమాన్యం స్పందించలేదు. సెక్రటేరియట్ లో ఆందోళన చేస్తున్న సిబ్బంది ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy newslinetelugu latest-news news-updates

Related Articles