భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తాజాగా కన్నుమూశారు. శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో మరణించారు. ఆగస్టు 19న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్
న్యూస్ లైన్ డెస్క్: భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తాజాగా కన్నుమూశారు. శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో మరణించారు. ఆగస్టు 19న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరి 25 రోజుల చికిత్స తర్వాత చివరికి కన్నుమూశారు. 72 సంవత్సరాల ఏచూరి తన జీవితంలో ఎన్నో పదవులు, ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సాధించిన ఏచూరి మరణంతో కమ్యూనిస్టు పార్టీ నాయకులే కాకుండా ఇతర నాయకులు ఆయనకు నివాళులర్పించారు.
ఏచూరి బాల్యమంతా హైదరాబాదులోనే గడిచింది. తర్వాత ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్లో చదివారు. అలాంటి ఈయన జేఎన్యు నుంచి ఎంఏ పట్టా పొందారు. అలాంటి ఏచూరీ ముందుగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ లో చేరి ఆ తర్వాత సిపిఐ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వరుసగా మూడుసార్లు సిపిఎం జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఏచూరి 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టారు.
కేరళ బెంగాల్ నుంచి కాకుండా ఎస్ఎఫ్ఐ నుంచి మొదటి జాతీయ అధ్యక్షుడిగా ఈయన రికార్డ్ క్రియేట్ చేశారు. అలాంటి సీతారాంకు దాదాపుగా 12 భాషల వరకు వస్తాయి. ఆయన రెండోసారి వెస్ట్ బెంగాల్ నుంచి కూడా రాజ్యసభకి అడుగు పెట్టారు. శ్రామిక ప్రజల కష్టాలు, రైతాంగం ప్రభుత్వ ఆర్థిక విధానాలు, విదేశీ విధానాలు మతతత్వంపై ఎన్నో పోరాటాలు చేశారు. అలాంటి ఏచూరి సీతారాం కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటాయని చాలామంది అనుకుంటారు.
కానీ ఆయన మొత్తం 40 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయట. అయితే తన భార్య సీమసిస్థి జాబ్ చేయడం వల్ల ఆయనకు ఆర్థికంగా సహకారం అందిస్తుందని ఏచూరి చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ విధంగా ఉన్నన్ని రోజులు ప్రజాసేవ అంటూ తిరిగినటువంటి ఏచూరి సదాసిదా జీవితాన్ని మాత్రమే గడిపారని చెప్పవచ్చు.