ఇంటీరియర్ కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఇవన్నీ ఆర్కే చెప్తున్న మాటలు కాదని ఆయన తెలిపారు. అధ్యయనం చేశాకే ఆరోపణలు చేస్తున్నామని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: అన్న క్యాంటీన్లను తాము వ్యతిరేకిచడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పేదలను ఆదుకునే పథకాలు కూడా ఉండాలని అన్నారు. గతంలో అన్న క్యాంటీన్ల పేరుతో అవినీతి జరిగిందని గుర్తుచేశారు. అన్న క్యాంటీన్లు రద్దీ ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
కానీ, ప్రస్తుతం 114 క్యాంటీన్లు ఊళ్లకు దూరంగా ఉన్నాయని అంబటి తెలిపారు. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో కూడా అంచనాలు పెంచారని ఆయన అన్నారు. అన్న క్యాంటీన్లలో రూ.31కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ఇంటీరియర్ కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఇవన్నీ ఆర్కే చెప్తున్న మాటలు కాదని ఆయన తెలిపారు. అధ్యయనం చేశాకే ఆరోపణలు చేస్తున్నామని అన్నారు.
అన్న క్యాంటీన్లను టీడీపీ ఆఫీసులుగా మార్చారని విమర్శించారు. వైసీపీ హయాంలో రంగుల గురించి పెద్ద రచ్చ చేశారు. అన్న క్యాంటీన్లకు పసుపురంగు ఎలా వేస్తారని ఆ అంబటి ప్రశ్నించారు.