కాని ఇక్కడ మనకు తెలుసుకుంటున్న దేవాలయం పూర్తిగా నెయ్యి వాడి కట్టారట. అందుకే ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకమైన శక్తులున్నాయని నమ్ముతారు జనాలు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎక్కడైనా బిల్డింగ్ కట్టాలంటే .. నీరు కావాల్సిందే..ఎంత కొండతో కట్టినా ...చిన్న చిన్న అవసరాలకు సున్నం ..నీరు వాడేవారు క్రీస్తుపూర్తం కట్టడాలు చూస్తే అది మనకి అర్ధమవుతుంది. కాని ఇక్కడ మనకు తెలుసుకుంటున్న దేవాలయం పూర్తిగా నెయ్యి వాడి కట్టారట. అందుకే ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకమైన శక్తులున్నాయని నమ్ముతారు జనాలు.
రాజస్థాన్ లోని భండాసర్‌లో ఉంది ఇలాంటి అరుదైన దేవాలయ. 15వ శతాబ్ధంలో బండా షా ఓస్వాల్ అనే సంపన్న వ్యాపారి ఈ ఆలయాన్ని నిర్మించారు. జైనుల్లో ఐదవ తీర్ధాంకరుడైన సుమతీనాథ్ కు ఈ దేవాలయం అంకితం చేశారు. దేవాలయం అంతా చక్కని శిల్పాలు, రంగురంగుల కుడ్య చిత్రాలతో చాలా అందంగా ఉంటుంది. ఈ దేవాలయానికి జైన సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. గోడలు , స్తంభాలు పై కప్పులు చాలా అందంగా పెయింట్ చేయబడి ఉంటాయి. వివధ జైన తీర్ధంకరుల జీవితాలు..జైన తీర్ధాంకరుల జీవితాల దృశ్యాలు ఉంటాయి. ఈ ఆలయ నిర్మాణం వెనుక వైవిధ్యభరితమైన కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ దేవాలయాన్ని ..బండా షా మొదట భూమిలో నిర్మించాలనుకున్నారు . గ్రామస్థులను సంప్రదించినప్పుడు వాళ్ళు దానికి అంగీకరించలేదు. దేవాలయ నిర్మాణానికి చాలా నీరు అవసరం ..అంత నీటిని ఉపయోగిస్తే తమకు ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆలయం పూర్తవుతుంది కానీ, ఇక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తారని అన్నారు. అయితే, నీటికి బదులుగా నెయ్యితో ఆలయం నిర్మించారనే వాదనను కొందరు కొట్టేపడేస్తారు. అలా చేస్తే గుడి పడిపోతుందని అంటారు. నీటి కొరత ఉంది కాబట్టి అసలు నెయ్యి ని వాడి ఉంటారని కూడా కొందరు వాదిస్తున్నారు.