జూలై 12వ తేదీన ఆనంత్ అంబానీ, రాధిక మార్చంట్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి దేశ, విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. అలాంటి ఈ పెళ్లిలో ఒక హోటల్ నిర్వహించే నిర్వాహకురాలు 70 ఏళ్ల
న్యూస్ లైన్ డెస్క్: జూలై 12వ తేదీన ఆనంత్ అంబానీ, రాధిక మార్చంట్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి దేశ, విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. అలాంటి ఈ పెళ్లిలో ఒక హోటల్ నిర్వహించే నిర్వాహకురాలు 70 ఏళ్ల ముసలావిడ కూడా హాజరయ్యారు. అంతేకాదు రాధిక ఆమె కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదాలు కూడా తీసుకుంది. ఇంతకీ ఆవిడ ఎవరు? ఆ వివరాలు ఏంటో చూద్దాం.
స్వాతంత్రాన్ని కంటే ముందే ముంబైలో స్టౌవ్ వెలిగించిన "కేఫ్ మీట్ మైసూర్ కేఫ్." ఈ హోటల్ నిర్వాహకురాలు శాంతేరి నాయక్. ఈమె నిర్వహించే ఓటల్ కి అప్పట్లో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ కూడా వచ్చేవారట. ఇక వీరందరికంటే దేశంలోని అత్యంత సంపన్నుడైనటువంటి ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రతి ఆదివారం ఇక్కడే గడిపే వాళ్ళని తెలుస్తోంది.
ఇంతటి ప్రముఖులు వస్తున్నారంటే ఆ హోటల్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబైలోని మాతుంగ ఏరియాలో కింగ్స్ సర్కిల్ రైల్వే స్టేషన్ వద్ద ఉంటుంది మైసూరు కేఫ్. ఈ కేఫ్ ను శాంతేరి నాయక్ మామ నగేష్ రామా నాయక్ స్థాపించారు. కర్ణాటక నుంచి వచ్చి ముంబైలో అడుగుపెట్టి హోటల్ నిర్వహిస్తూ ఎంతో పేరు సంపాదించారు. తన మామ చనిపోయిన తర్వాత శాంతేరి నాయక్ ఆ హోటల్ నిర్వహణ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం 70 సంవత్సరాలు ఉన్న ఇంకా హోటల్ నడిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ఫుడ్ రుచులు తెలుసుకొని దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుంటుంది. విదేశాల నుంచి వచ్చిన పర్యటకులకు కూడా ఆ రుచులను అందిస్తుంది. వంట చేసి వాటిని ఇష్టపడమే ఆమె సక్సెస్ ఫార్ములా. ముఖ్యంగా ఈమె కస్టమర్లకు ఫుడ్ అందించి వారి కడుపు నిండాక ఫుడ్ గురించి ఏ విధమైనటువంటి ఆన్సర్ ఇస్తారో అదే ఆమె నమ్ముతుంది.
ముఖ్యంగా ఆహారం నాలుక మీద పడగానే, రుచిగా ఉంటే తప్పక దాన్ని ఆస్వాదించి మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తారు. అన్నం తిన్న నాలుక అబద్ధం చెప్పదు అనే ఫార్ములానే శాంతేరి నాయక్ నమ్ముతారట. అందుకే ఆమె కస్టమర్స్ నుంచి ఫుడ్ తిన్న తర్వాత ఫీడ్ బ్యాక్ తప్పక అడుగుతుంది. ఫుడ్ బాగుందని చెబితే ఆమె ఆనందానికి అవధులు ఉండవు. అలా కస్టమర్ల ఇష్టాలని నమ్మకంగా పెట్టుకొని ఈ హోటల్ ను నిర్వహిస్తూ వచ్చిన ఈమెకు అనంత్ అంబానీ పెళ్లిలో స్టాల్ పెట్టుకోవడానికి ఛాన్స్ వచ్చింది. దీంతో ఈమె దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.