BR.గవాయ్, KV.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ కవిత తరఫున వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని ఆయన సెక్షన్ 45 PMLA ప్రొవిజోను ప్రస్తావించారు.
న్యూస్ లైన్, ఢిల్లీ: BRS ఎమ్మెల్సీ కవిత కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ, ఈడీలకు సుప్రీం కోర్టు నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత గత ఆరు నెలలుగా జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఆమె ఉన్నారు. అయితే, ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ వాయిదాపై విచారణను ముందుకు సాగిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ఆమె కేసు విచారణ జరిగింది. అయితే కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు నిరాకరించాయి.
ఇదే కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక తాజగా, బెయిల్ కోసం కవిత ఢిల్లీలోని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
BR.గవాయ్, KV.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ కవిత తరఫున వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని ఆయన సెక్షన్ 45 PMLA ప్రొవిజోను ప్రస్తావించారు. అయితే, ఇందులో సీబీఐ, ఈడీల అభిప్రాయాలు కూడా అవసరమని న్యాయస్థానం తెలిపింది. సీబీఐ, ఈడీకౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.