లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సందర్భంగా జరిగిన పరిచయం తామిద్దరి మధ్య ప్రేమకు దారితీసిందని తమన్నానే చెప్పారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: టాలీవుడ్ లోని ,బాలీవుడ్ లోను తమన్నా ..సూపర్ హీరోయిన్ . అయితే రీసెంట్ గా చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా తన ప్రియుడు విజయ్ వర్మతో డేటింగ్ లో బిజీ బిజీగా ఉందనుకునేలోపే బ్రేకప్ వార్తలు గుప్పుమంటున్నాయి. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సందర్భంగా జరిగిన పరిచయం తామిద్దరి మధ్య ప్రేమకు దారితీసిందని తమన్నానే చెప్పారు.
దాదాపు రెండేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇప్పుడు మళ్లీ ఇద్దరు సింగిల్ గా కనిపిస్తున్నారు. విడిపోయారనే వార్తలు గుప్పుమంటున్నాయి. రవీనా టాండన్ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లోనూ తమన్నా ఒంటరిగా కనిపిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే రవీనా టాండన్ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లోనూ తమన్నా ఒంటరిగానే పాల్గొన్నారు.
తమన్నాతో బ్రేకప్ వార్తలపై విజయ్ వర్మ తాజాగా స్పందించారు. రిలేషన్‌షిప్‌లోని ప్రతి విషయాన్ని ఆనందించాలని అన్నారు. సంతోషంతో పాటు బాధను, చిరాకును, కోపాన్ని అన్నింటిని ఇద్దరు భరిచాలని వర్మ చెబితే ..రిలేషన్ షిప్ లో ఉన్నప్పటి కంటే లేనపుడే తాను ఆనందంగా ఉన్నానని తమన్నా చెప్పింది. అంటే విడిపోయామని కన్ఫర్మ్ చేసేశారంటున్నారు నెటిజన్లు.