మహిళ ఆసియా కప్ పోరులో భారత ప్లేయర్స్ అదరగొట్టారు. స్మృతి మంధన హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ అద్భుతంగా రాణించారు.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: మహిళ ఆసియా కప్ పోరులో భారత ప్లేయర్స్ అదరగొట్టారు. స్మృతి మంధన హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ అద్భుతంగా రాణించారు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లంక బౌలర్లు కవిషా దిల్హరి రెండు వికెట్లు పడగొట్టాగా.. చమరి అతపత్తు, సచికా ప్రబోధని, సచిని నిసంసల తలా వికెట్ తీశారు.
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా జట్టుకు సాలిడ్ స్టార్ట్ లభించింది. భారత్ ఓపెనర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ ధనాధన బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడి కలిసి స్కోర్ బోర్డుకు 40 పరుగులు జతచేశారు. అయితే షఫాలీ(16), కవిషా దిల్హరి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులో ఉమా చెత్రీ(9) కూడా పెవిలియన్ బట పట్టింది. దాంతో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 60 రన్స్ కొట్టింది. ఓవైపు వికెట్లు పడుతున్న స్మృతి మంధన లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీలు, సిక్సర్లు బాదింది. దాంతో మంధన ( 36 బంతుల్లో 53 పరుగులు 9 ఫోర్లు, 1 సిక్సర్) సహయంతో అర్ధ శతకం పూర్తి చేసింది. అయితే ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంత రాణించలేకపోయింది. కౌర్(11)ను సచికా ప్రబోధని వెనక్కి పంపింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ మంధనతో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడింది. వీళ్లిందరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. అయితే జెమీమా(29) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. ఆ కాసేపటీకే మంధన(60), కవిషా దిల్హరి ఓవర్‌లో భారీ ష్టార్ట్ ఆడే క్రమంలో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. ఇక ఆఖరిలో రిచా ఘోష్(30) తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. దాంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లంక బౌలర్లు కవిషా దిల్హరి రెండు వికెట్లు పడగొట్టాగా.. చమరి అతపత్తు, సచికా ప్రబోధని, సచిని నిసంసల తలా వికెట్ తీశారు.