తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు సంబంధించి గత వారం రోజుల నుంచి ఈ రోజు లేదా రేపు ఫైనల్ కీ అంటూ ఈ విద్యాశాఖ పేర్కొంటూ మళ్ళీ వాయిదాలు వేయడం పట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు సంబంధించి గత వారం రోజుల నుంచి ఈ రోజు లేదా రేపు ఫైనల్ కీ అంటూ ఈ విద్యాశాఖ పేర్కొంటూ మళ్ళీ వాయిదాలు వేయడం పట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్తే ఇస్తామని ఒక ఖచ్చిత మైన తేదీ ఇవ్వాలని అలా కాకుండా ఇదిగో అదిగో అంటూ డీఎస్సీ అభ్యర్థులను గందర గోళ పరచడం సరికాదని అభ్యర్థులు విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ ఫైనల్ కీ వెంటనే విడుదల చేయాలని, అలాగే త్వరగా జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీలను ఆగస్ట్ 13వ తేదీన విడుదల చేసింది. ఇక ఈ కీపై ఆగస్ట్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అయితే ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఫైనల్‌కీ, ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. కానీ ఇంకా ఫైనల్ కీ విడుదల చేయకపోవడంపై డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.