Kedarnath: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

దూరప్రాంత యాత్రికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాల కారణంగా మందాకిని నది నీటిమట్టం పెరిగిన విషయం తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కారణంగా నడకమార్గం మొత్తం దెబ్బతినడంతో పాటు గౌరీకుంద్ నుండి కేదార్‌నాథ్ మధ్య 13 మార్గాలు విధ్వంసం అయ్యాయి. 


Published Aug 03, 2024 04:22:24 PM
postImages/2024-08-03/1722682344_kedarnath.jpg

న్యూస్ లైన్ డెస్క్: కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా నడకమార్గం బాగా దెబ్బతిన్నది. గౌరీకుంద్-కేదార్‌నాథ్‌ మధ్య13 చోట్ల విధ్వంసం జరిగిందని అధికారులు వెల్లడించారు. దీంతో పలువురు యాత్రికులు చిక్కుకుపోయారు. స్వర్గరోహిణి కాటేజీలో పలువురు తెలుగు యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఆహారం, నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. సహాయం కోరుతూ కేంద్రమంత్రి సంజయ్‌కు మెసేజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో సహాయబృందాలు యాత్రికులను హెలికాప్టర్లతో తరలిస్తున్నట్లు సమాచారం. స్థానికులకే సహాయక సిబ్బంది ప్రాధాన్యత ఇస్తున్నారని దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు వాపోతున్నారు. 

మరోవైపు సహాయ చర్యలకు  వాతావరణం అనుకూలించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో దూరప్రాంత యాత్రికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాల కారణంగా మందాకిని నది నీటిమట్టం పెరిగిన విషయం తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కారణంగా నడకమార్గం మొత్తం దెబ్బతినడంతో పాటు గౌరీకుంద్ నుండి కేదార్‌నాథ్ మధ్య 13 మార్గాలు విధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడికి వెళ్లిన పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu kedarnath

Related Articles