Telangana: అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

 ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని PDSU నాయకులు ఆందోళన చేపట్టారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-24/1721814158_modi20240724T151021.512.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. PDSU ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ ముట్టడికి PDSU పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని PDSU నాయకులు ఆందోళన చేపట్టారు. 

దీంతో పోలీసులు వారిని ఆదుకునేందుకు ప్రయత్నించారు. PDSU నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ ముందు ధర్నా చేసేందుకు ప్రయత్నించిన PDSU నాయకులను పోలీసులు వెనక్కి పంపించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో  PDSU నాయకులను పోలీసు వ్యాన్ లో ఎక్కించబోయారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు, PDSU నాయకుల మధ్య తోపులాట జరిగింది. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu congress telanganam cm-revanth-reddy congress-government assembly pdsu

Related Articles