విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు, అభ్యర్థులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేయాలని గత కొంత కాలంగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న డీఎస్సీ నోటిషికేషన్‌ను రద్దు చేసి అదనంగా మరో 30 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేయాలని నిరుద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. గ్రూప్స్ అభ్యర్థులను 1:100 రేషియోలో క్వాలిఫై చేయాలని, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు, అభ్యర్థులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేయాలని గత కొంత కాలంగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న డీఎస్సీ నోటిషికేషన్‌ను రద్దు చేసి అదనంగా మరో 30 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేయాలని నిరుద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. గ్రూప్స్ అభ్యర్థులను 1:100 రేషియోలో క్వాలిఫై చేయాలని, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే విద్యార్థి సంఘం నాయకుడు మోతిలాల్‌తో పాటు అశోక్, బక్క జడ్సన్ నిరుద్యోగులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నిరుద్యోగులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే, సోమవారం సెక్రటేరియట్ ముట్టడికి పిలుపుతో నిరుద్యోగులు, AISF నాయకులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నిరుద్యోగులను ఆందోళన చేయనివ్వకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు సెక్రటేరియట్ వద్ద భారీగా మోహరించడంతో ఆ ప్రాంతంలో తీర్వ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పొలిసు బలగాలు కనిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీసీ సంఘం, AISF నాయకులు.. సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంత పెద్ద పోలీసు బలగాలు మోహరించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎవరు అడ్డొచ్చినా సరే సెక్రటేరియట్ ముట్టడి చేసి తీరుతామని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.