జ్యోతిష్యుడు వేణుస్వామి మీద మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన చేసిన కామెంట్లపై పలువురు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈరోజు వేణుస్వామి పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది.
న్యూస్ లైన్ డెస్క్ : సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కామెంట్ చేస్తున్నాడని.. జ్యోతిష్యాల పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జ్యోతిష్యుడు వేణుస్వామి మీద మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన చేసిన కామెంట్లపై పలువురు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈరోజు వేణుస్వామి పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది.
మహిళా కమిషన్ పిటిషన్ మీద విచారించిన హైకోర్టు వేణుస్వామికి నోటీసులు ఎందుకు ఇచ్చారు అని మహిళా కమిషన్ ని ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వడానికి గల కారణాలు, అర్హతలు ఏంటో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. మహిళా కమిషన్ తరపున వాదనలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలు వినిపించారు. వేణుస్వామి జ్యోతిష్యం పేరుతో అబద్ధాలు, మోసపూరిత ప్రకటనలుచేస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.