GOLD: భారీగా పెరిగిన బంగారం ధరలు ..ఇప్పుడు బంగారం గ్రాముధర ఎంతంటే !

దేశంలోని ప్రముఖ నగరాల్లో  గ్రాము బంగారం రూ. 8,755, ముంబైలో రూ. 8,755, ఢిల్లీలో రూ.8,770 వద్ద కొనసాగుతున్నాయి. 


Published May 19, 2025 02:00:00 PM
postImages/2025-05-19/1747643507_goldprice3.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధర భారీగా పెరిగింది. గతవారం చివరిలో భారీగా పెరిగిన ధరలు మధ్యలో కాస్త తగ్గుముఖం పట్టినా ...ఇప్పుడు మళ్లీ తిరిగి ఊపందుకుంటుంది. చైనా , అమెరికా , ఇండియా , పాకిస్తాన్ దేశాల మధ్య గొడవల జరుగుతున్నాయి. పెట్టుబడి దారులు వారి పెట్టుబడులు సేఫ్ గా ఉండాలని బంగారం లో పెట్టుబడులు పెడుతున్నాయి. 2క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చి చూసుకుంటే 100 గ్రాములకు ఏకంగా రూ. 3,500 పెరుగుదల నమోదు చేసింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో  గ్రాము బంగారం రూ. 8,755, ముంబైలో రూ. 8,755, ఢిల్లీలో రూ.8,770 వద్ద కొనసాగుతున్నాయి. 


దీంతో దేశంలోని పలు నగరాల్లో నేటి ధరలను చూస్తే ముంబై లో 9, 551, బెంగళూరులో రూ. 9,551, ఢిల్లీలో రూ. 9,566గా ఉన్నాయి. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ను ఇదే ధర నడుస్తుంది. గ్రాము బంగారం ధర రూ.8,755 నడుస్తుంది. 24క్యారెట్ల బంగారం రిటైల్ విక్రయ ధరలు రూ. 9, 551 వద్ద ఉంది. ఇదే క్రమంలో వెండి కిలో ధర రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. లక్ష 9వేల దగ్గర ఉంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business gold-rates silver-rate stock-market

Related Articles