దీనిపై స్పందించిన సింధు ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తే ట్రోలింగ్ చేస్తారా..? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని కామెంట్లు చేస్తారా అని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న నన్ను శంకిని అని మాట్లాడుతున్నాడు.. నేను ఇదే TSPSC సమస్యల మీద గత ప్రభుత్వం ఉన్నపుడు కూడా వచ్చి మాట్లాడాను.. ఆరోజు నేను శంకిని లాగా కనపడలేదా అని నిలదీసింది.
న్యూస్ లైన్ డెస్క్: TGPSC ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళనలు చేపడుతున్న వారిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిరసనల్లో భాగంగా ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేసిన సింధు అనే ఓ యువతిపై కాంగ్రెస్‌కు చెందిన కొందరు ట్రోల్ చేశారు. BRS పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ కామెంట్లు చేశారు.
తాజగా, దీనిపై స్పందించిన సింధు ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తే ట్రోలింగ్ చేస్తారా..? అంటూ శనివారం ఓ వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని కామెంట్లు చేస్తారా అని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న నన్ను శంకిని అని మాట్లాడుతున్నాడు.. నేను ఇదే TSPSC సమస్యల మీద గత ప్రభుత్వం ఉన్నపుడు కూడా వచ్చి మాట్లాడాను.. ఆరోజు నేను శంకిని లాగా కనపడలేదా అని నిలదీసింది.
గతంలో BRS అధికారంలో ఉన్న సమయంలో కూడా నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నిరసనలు తెలిపామని గుర్తుచేశారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్లు నన్ను కొన్నారా..? అప్పుడు నన్ను ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదు అని సింధు అడిగారు. తనను పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్న వాళ్లు ఏ పార్టీ కండువా కప్పుకోవడం చూశారా అని అన్నారు. ఒక ఆడ బిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేయడం సరికాదని అన్నారు.
నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి కాంగ్రెస్ నాయకులు.. తమను గెలిపించాలని BRS ప్రభుత్వం కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఇప్పుడు మోసం చేశారని ఆమె విమర్శించారు. గతంలో నిరుద్యోగుల కోసమే AICC నేతలను కలిశామని గుర్తుచేశారు. ప్రొఫెసర్ కోదండరాం చెప్పినట్లే అన్నీ చేశామని సింధు అన్నారు.