న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నాగచైతన్య జాతకం చెప్పిన తర్వాత వేణుస్వామి పెద్దగా వార్తల్లో లేరు. కాని ఇప్పుడు మరో సారి పుష్ప సినిమా చూసి ..అల్లు అర్జున్ గురించి మాట్లాడారు.ఈ మూవీ మొదటి రోజే ఏకంగా రూ.295 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారతీయ సినిమా చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా పుష్ప 2 రికార్డుల కెక్కింది. రాజమాతంగి గెటప్‌లో బ్లూ కలర్ చీరలో జాతర ససీన్స్ లో అల్లు అర్జున్ ఇరగదీశారు.
అల్లు అర్జున్ కు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఆయన సినిమాలు వెయ్యి కోట్లు వసూళ్లు చేస్తాయన్నారు . మరో 15 ఏళ్లు ఆయనకు ఇండస్ట్రీలో తిరుగులేదు. బన్నీతో సినిమా తీస్తే నిర్మాతలు ఎవరూ కూడా నష్టపోరు’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు వేణు స్వామి.
కాగా గతంలోనే పుష్ప-2 సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పిన వేణు స్వామి, ఇప్పుడు మళ్లీ పుష్ప-2 సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. నాగచైతన్య , సమంత విషయంపై వేణుస్వామి చాలా సార్లు జాతకం చెప్పి ..చాలా ఇబ్బందిపడ్డారు. పోలీసు కేసులు ,నెగిటివ్ కామెంట్లు దీంతో ఫుల్ సైలెంట్ అయ్యారు. ఇఫ్పుడు మళ్లీ అల్లుఅర్జున్ ఫ్యూఛర్ చెప్పారు. దీంతో సోషల్ మీడియాతో ఫుల్ వైరల్ అవుతుంది.