మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కెమెరా కలకలం సృష్టించింది. ఈ కాలేజీలోని గర్ల్స్ టాయిలెట్‌లో మొబైల్ కెమెరాను పెట్టారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తెలంగాణలో మరో కాలేజీ లో అమ్మాయి వాష్ రూంలో వీడియో కలకలం రేపింది. ఇప్పటికే హైదరాబాద్ లో కండ్లకోయ సీఎం ఆర్ కాలేజీ లో బాత్రూమ్ లో వీడియోల తియ్యడం కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కెమెరా కలకలం సృష్టించింది. ఈ కాలేజీలోని గర్ల్స్ టాయిలెట్‌లో మొబైల్ కెమెరాను పెట్టారు.
పాలిటెక్నిక్ కాలేజీ లో బ్యాక్ లాగ్స్ రాసేందుకు వచ్చిన థర్డ్ ఇయర్ విద్యార్ధి సిద్దార్ధ్ గా గుర్తించారు. తనే వాష్ రూం లో మొబైల్ కెమరా పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు వీడియోను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల స్టేట్‌మెంట్ రికార్డ్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.
తమ వాష్‌రూంలో మొబైల్‌తో వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించిన విద్యార్థినులు నేడు కాలేజీ ఎదుట నిరసనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సిద్దార్ధ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.