Srivari Hundi: తిరుమల వెంకన్నకు గతేడాది వెయ్యి కోట్లకు పైగా ఆదాయం !

టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ సత్రాలలో 6.30 కోట్ల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని పేర్కొంది. 


Published Jan 02, 2025 12:39:00 PM
postImages/2025-01-02/1735801815_TTDHundi.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా గతేడాది రూ. 1365 కోట్ల ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మొత్తం 2024 లో 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 99 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ పేర్కొంది. భక్తులకు ఏడాది మొత్తంలో 12.14 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు తెలిపింది. టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ సత్రాలలో 6.30 కోట్ల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని పేర్కొంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu latest-news tirumala tirumala-srivaru

Related Articles