తనకు సమయం ఇవ్వడంతో పాటు జ్ఞానాన్ని పంచడంపై గుకేష్ రజనీకాంత్ కు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి గుకేశ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ విలువైన బహుమతి ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన గుకేశ్ కు యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకుడు పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ( ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి) పుస్తకాన్ని రజినీకాంత్ బహుకరించారు. తనకు సమయం ఇవ్వడంతో పాటు జ్ఞానాన్ని పంచడంపై గుకేష్ రజనీకాంత్ కు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి గుకేశ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
పరమహంస యోగానంద స్థాపించిన వైఎస్ఎస్ నుంచి క్రియాయోగ దీక్ష తీసుకున్న రజినీకాంత్ క్రియ యోగ ధ్యానాన్ని అభ్యసిస్తున్నారు. తరచూ రాంచీలోని వైఎస్ఎస్ ఆశ్రమాన్ని అలాగే ఉత్తరాఖండ్ లోని రాణి ఖేత్ లో వున్న మహావతార్ బాబాజీ గుహను రజనీకాంత్ సందర్శిస్తుంటారు. ఒక యోగి ఆత్మకథ(ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి): ప్రపంచంలోని ఆధ్యాత్మిక పుస్తకాల్లో అత్యంత ప్రజదరణ పొందిన ఈ పుస్తకాన్ని పరమహంస యోగానంద 1946లో రచించారు.
అదే ఏడాది ఈ పుస్తకం ప్రచురితమైంది. ఈ పుస్తకం విడుదలై ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి ప్రపంచ వ్యాప్తంగా 14 భారతీయ భాషలతో పాటు 50 కి పైగా భాషల్లో ఇది అనువాదమైంది. భారతదేశంలోని గొప్పయోగుల్లో ఒకరైన పరమహంస యోగానంద ఈ పుస్తకంలో తత్వశాస్త్రం, యోగశాస్త్రం, క్రియాయోగం, ధ్యానం గురించి లోతుగా చర్చించారు. పుస్తకంతో పాటు జీవితాన్ని సమూలంగా మార్చే పరమహంస యోగానంద అందించిన యోగ, ధ్యాన ప్రక్రియల గురించి మరింత సమాచారం కోసం https://yssi.org/AY క్లిక్ చేయండి.