కర్ణాటక లోని బెళగావిలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు దూరమయ్యారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థత కారణంగా ఆమె కర్ణాటక లోని బెళగావిలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు దూరమయ్యారు.
'నవ సత్యాగ్రహ బైఠక్' పేరిట నిర్వహిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, మాజీ సీఎంలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు... ఇలా దాదాపు 200 మంది కాంగ్రెస్ నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే అక్కడే సోనియాగాంధీ అస్వస్థతకు గురయయారు. ప్రియాంక గాంధీ తల్లి వెంటే ఉండి తన బాగోగులు చూసుకుంటున్నారు. సోనియా కోలుకుంటే ప్రియాంక కూడా ఈ సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది. కాగా, రాహుల్ గాంధీ ఈ సమావేశాలకు హాజరయ్యారు.