ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడి స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసింది. అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలని ఆదేశించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఢిల్లీలో కాని పరిసర ప్రాంతాల్లో కాని స్కూల్స్ లో బంగ్లాదేశ్ పిల్లలు కాని ఉంటే వారిని గురించిన వివరాలు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సర్కులర్ జారీ చేసింది ప్రభుత్వం. అంతేకాదు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడి స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసింది. అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలని ఆదేశించింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా చాలా మంది అనుమతి లేకుండా అక్రమంగా భారత్ లో నివసిస్తున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించేందుకు డ్రైవ్ లను చేపట్టామని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు.
ఢిల్లీలో ఉంటున్న అక్రమ వలసదారులను గుర్తించాలని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే అనాధికారికంగా ఇప్పటికే చాలా మంది ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మున్సిపల్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్య వలసదారుల సమస్య కీలకం కానుంది.