కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళలకు రూ.2500 ఇస్తా అని చెప్పి మోసం చేసిందని ఓ మహిళ తన గోడు మీడియాకు చెప్పుకుంది.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళలకు రూ.2500 ఇస్తా అని చెప్పి మోసం చేసిందని ఓ మహిళ తన గోడు మీడియాకు చెప్పుకుంది. ఇప్పటి వరకు రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. కానీ అది కూడా వస్తలేదని మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్యాస్ బుక్ చేసుకోవడానికి వెళ్తే రూ.7000 అయ్యిందని, గరీబ్ వాళ్ళం ఎలా బ్రతకాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కాంగ్రెస్ సర్కార్ మహిళలకు కేవలం ఫ్రీ బస్సు ఒక్కటే చేసిందని, తమతో ఓట్లు వేపించుకున్నారు.. కానీ చేసింది ఏమి లేదని మండిపడ్డారు.
ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుందని, ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌లో ఎన్నికలు వస్తున్నాయిని ఇంకెప్పుడు ప్రభుత్వం మహిళలకు రూ.2500 ఇస్తారని ప్రశ్నించింది. గరీబ్ వాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే వుంటున్నారని, పైసా ఉన్నవాళ్లు బాగుపడుతున్నారని పేర్కొంది. మేము ఇప్పుడు ఎలా బ్రతకాలి.. మేము రోడ్ పక్కన బ్రతికే వాళ్ళం మాకు ప్రభుత్వం లోన్లు ఇప్పించాలని కోరింది. కాంగ్రెస్ ఫ్రీ కరెంటు అన్ని చెప్పింది. కానీ అది కూడా వస్తలేదని చెప్పింది. మహిళలకు చాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఎన్నికలో గెలిచిందని, కానీ ఇప్పటి వరకు ఏ హామీ అమలు చేయాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.