KGBV: హాస్టల్‌లో పురుగుల అన్నం .. అడిగితే చివాట్లే..!

పురుగులు వస్తున్నాయని వంట చేసే సిబ్బందికి చెప్పినా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ విషయం అడిగేందుకు ఎస్ఓగా పని చేస్తున్న స్వప్న వద్దకు వెళ్తే గిన్నెతో కొట్టిందని వెల్లడించారు.  


Published Aug 06, 2024 10:35:02 AM
postImages/2024-08-06/1722920702_kgbvschool.jpg

న్యూస్ లైన్ డెస్క్: పురుగుల అన్నం పెట్టడమే కాకుండా అడిగితే కొడుతున్నారని విద్యార్థులు వాపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గత కొంత కాలంగా పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు వవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు చేసి పెడుతున్నారని అన్నారు. ఆ అన్నం తినడంతో 30 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. 

పురుగులు వస్తున్నాయని వంట చేసే సిబ్బందికి చెప్పినా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ విషయం అడిగేందుకు ఎస్ఓగా పని చేస్తున్న స్వప్న వద్దకు వెళ్తే గిన్నెతో కొట్టిందని వెల్లడించారు. హాస్టల్‌లో ఉండలేమని .. తీసుకెళ్లిపోమని విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద కన్నీరు పెట్టుకున్నారు. దీంతో  విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్‌లో ఉంచే పరిస్థితి లేదని, ఇంటికి తీసుకెళ్లిపోతామని చెబుతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu students telanganam kgbv

Related Articles