Bhupal Reddy: రింగ్ రోడ్డు కాదు.. దొంగ రోడ్డు 2024-06-21 14:43:08

న్యూస్ లైన్ డెస్క్: రింగ్ రోర్డు కాదు దొంగ రోడ్డు అని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి తమ అనుచరులకు దోచి పెట్టడానికి రింగ్ రోడ్డుపై నాటకం ఆడుతున్నాడాని మండిపడ్డారు. భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలు, పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. 3000  కుటుంబాలు కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న ప్లాట్లు, ఇండ్లు, నష్ట పోతున్నా పట్టించు కోకుండా అధికారం ఉందనే అహంకారంతో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్లాన్ 1, 2, వదిలేసి తమ అనుచరుల లబ్ధికోసం ప్లాన్ 3 ఎంచుకున్నారన్నారు. తక్షణమే ప్లాన్ 3 ఉపసంహారించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే బాధితుల తరుపున తాము పోరాడుతామని స్పష్టం చేశారు. 15 రోజులలోగా ప్లాన్ 3 ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే బాధితులతో కలిసి పాదయాత్ర చేస్తామని ప్రభుత్వాన్ని కంచర్ల భూపాల్ రెడ్డి హెచ్చరించారు.