Cabinet: రుణమాఫీ అర్హులు ఎవరో చెప్పాని ప్రభుత్వం  2024-06-22 06:42:33

న్యూస్ లైన్ డెస్క్: రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు 2 లక్షల లోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయాలని కేబినేట్ నిర్ణయించిదని సీఎం రేవంత్ తెలిపారు. రైతు రుణమాఫీ విధివిధానలపై త్వరలోనే ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందన్నారు.  9 డిసెంబర్ 2018 నుంచి 12 డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న రైతు రుణాల వివరాలు తీసుకున్నామని, రైతుల రుణాలు మాఫీ చేయాడానికి 31 వేల కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. నిధులు సేకరించి రైతులకు రుణవిముక్తి  కల్పిస్తామన్నారు. అయితే రుణమాఫీ అర్హులు ఎవరు అనేది మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాడు చేస్తామని. ఈ సంఘంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ ఉంటారని తెలిపారు. జులై 15నాటికి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇస్తుందని, ఈ నివేదికపై అసెంబ్లీపై చర్చ జరుగుతుంన్నారు. 

Read More: Atal Sethu: అటల్ సేతు వంతెనకు పగుళ్లు