BRS: అధికారులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్  2024-06-23 07:04:52

న్యూస్ లైన్ డెస్క్: అధికారులకు బీఅర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని, వారి కోసం బ్లాక్ బుక్ రెడీ చేసినట్లు తెలిపారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఏ అధికారి ఎక్స్‌ట్రాలు చేస్తున్నారో వాళ్ల పేర్లు బ్లాక్ బుక్‌లో ఎంటర్ చేస్తున్నాని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అండదండలతో రెచ్చిపోయే అధికారులకు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అన్ని బ్లాక్ డేస్ ఏ ఉంటాయని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారం శాశ్వతం కాదని అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఖచ్చితంగా ఐదు సంవత్సరాల తర్వాత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అవ్వ, తాతలకు పింఛన్లు 2 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచుతామని, వికలాంగులకు 4 వేల నుండి 6 వేలకు పెంచుతామని చెప్పారు. కానీ వంద రోజుల్లో పింఛన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పాడని విమర్శించారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వేరే పార్టీలోకి వెళ్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోయిన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడిపోయిన ఏ ఒక్క నాయకుని కూడా తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ క్యాడరే పటిష్టంగా ఉందని, తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరం కార్యకర్తల కష్టపడతామని అన్నారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో అభివృద్ధి జరిగే లేదని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్, బిజెపి పాలిత ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం కంటే ఏదైనా రాష్ట్రం అభివృద్ధిలో ఉందా చెప్పాలన్నారు