T20 Worldcup: టాస్ గెలిచిన భారత్.. అఫ్గన్‌తో వార్ 2024-06-20 09:29:16

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 8 స్టేజ్‌లో ఆసక్తిర పోరు జరుగుతుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తొలిసారి సూప‌ర్ 8కు చేరిన‌ అఫ్గ‌న్ అజేయంగా దూసుకెళ్తున్న భార‌త్ జ‌ట్టుతో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టడియం వేదికగా తలపడతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  గ్రూప్ ఏ లోని టీమిండియా అజేయంగా సూపర్ 8కు దూసుకొచ్చింది. మ‌రోవైపు అఫ్గ‌నిస్థాన్ సైతం హ్యాట్రిక్ విజ‌యాల‌తో సూపర్ 8లో అడుగుపెట్టింది. కానీ, చివ‌రి మ్యాచ్‌లో ర‌షీద్ ఖాన్ సేన 104 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో వర్షం పడేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్ జరిగే సమయంలో వాన కురిసే ఛాన్స్ ఉంది. ఈ బిగ్ పోరులో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించింది. 

జట్టు వివరాలు:

టీమిండియా జ‌ట్టు : రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్, సూర్య‌కుమార్ యాద‌వ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్, ర‌వీంద్ర జ‌డేజా, కుల్దీప్ యాద‌వ్, జ‌స్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

అఫ్గ‌నిస్థాన్ జ‌ట్టు : ర‌హ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్), ఇబ్ర‌హీం జ‌ద్రాన్, న‌జీబుల్లా జ‌ద్రాన్, హ‌ర్జ‌తుల్లా జ‌జాయ్, గుల్బ‌దిన్ న‌యీబ్, అజ్మ‌తుల్లా ఒమ‌ర్‌జాయ్, ర‌షీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మ‌ద్, మ‌హ్మ‌ద్ న‌బీ, న‌వీన్ ఉల్ హ‌క్, ఫ‌జ‌ల్ హ‌క్ ఫారుఖీ.