ఐపీఎల్ ఈ నిషేధాన్ని ఎత్తేసింది. ఐపీఎల్ జట్లలోని అధిక శాతం మంది కెప్టెన్లు ఈ విధానాన్ని తప్పుపట్టకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఐపీఎల్ లో బౌలర్లు బంతికి కాస్త ఉమ్మి దానిని రుద్దడం పై చాలా గొడవలే జరిగాయి. ఆఖరికి దాన్ని నిషేధించారు కూడా. కాని సలైవా రుద్దడం వల్ల రబ్బరు బంతి జారిపోకుండా ఉంటుందనేది ప్లేయర్ల వాదన . అయితే ఐపీఎల్ ఈ నిషేధాన్ని ఎత్తేసింది. ఐపీఎల్ జట్లలోని అధిక శాతం మంది కెప్టెన్లు ఈ విధానాన్ని తప్పుపట్టకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా బాల్‌పై సలైవాను పూయడాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధించింది. 2022 లో కూడా ఈ నిషేధం పర్మినెంట్ గా ఉంటుందనే తెలిపారు. కాని ఇప్పుడు కెప్టెన్స్ అందరు ఒప్పుకోవడంతో ఈ నిషేధాన్ని తీసేసింది. ఇదే ఒక్కటే కాదు “మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ కోసం రెండో బంతి” అనే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఐపీఎల్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత రెండో బాల్‌ను ఇస్తారు. రాత్రిపూట జరిగే ఈ మ్యాచ్‌పై పడే మంచు బిందువుల ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చారు.
అయితే బాల్ ఛేంజెస్ విషయాన్ని బీసీసీఐ అంపైర్ల అభీష్టానికి వదిలేసింది. బాల్ ను మార్చాలా వద్దా అనేది అంపైర్లు నిర్ణయించుకుంటారు. మంచు బిందువులు మైదానం లో పడే తీరు ను అంపైర్ అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. రాత్రి జరిగే మ్యాచ్ లకు మాత్రమే ఈ అవకాశం . మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లలో రెండవ బంతిని ఉపయోగించే అవకాశం లేదు.