SIM: సిమ్ కార్డుల పరిమితి దాటితే జరిమానా ..? 2024-06-26 16:44:39

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశ్యవ్యాప్తంగా కొత్త టెలికం చట్టం అమలులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా కొత్త టెలికం చట్టం అమలులోకి వచ్చింది. దీంతో పాత రూల్స్ మారిపోయాయి. ఇక నుంచి ఎవరైనా డ్యూయల్ సిమ్ ..త్రిబుల్ సిమ్ అంటే చర్యలు తప్పవంటున్నారు.వేరొకరి ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు తీసుకుంటే జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు.


పురాతన ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం-1885, వైర్‌లెస్ టెలిగ్రాఫీ ( WIRELESS TELEGRAPHY) చట్టం-1993 స్థానంలో టెలి కమ్యూనికేషన్స్( TELECOMMUNICATION)  చట్టం- 2023 అమలులోకి వచ్చింది.నేటి (జూన్‌ 26) నుంచి టెలికమ్యూనికేషన్స్ చట్టం- 2023లోని సెక్షన్లు 1, 2, 10 నుంచి 30, 42 నుంచి 44, 46, 47 వరకు, అలాగే 50 నుంచి 58 వరకు, 61, 62 వరకు ఉన్న నిబంధనలలు అమలులోకి వస్తాయి. 


 కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం, జాతీయ భద్రత ప్రయోజనాల పరిరక్షణ, యుద్ధ సమయాల్లో టెలి కమ్యూనికేషన్ల నెట్‌వర్క్‌లు లేదా సేవలను కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవడంతో పాటు నిర్వహిస్తుంది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేది 'డిజిటల్ ఇండియా ఫండ్'( DIGITAL INDIA FUND) గా మారిపోతుంది.

టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023ని 18 డిసెంబర్ 2023న లోక్‌సభలో( LOKSABHA)  ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని 20 డిసెంబర్ 2023న లోక్‌సభ ఆమోదించింది. ఆ తర్వాత డిసెంబర్ 21న రాజ్యసభలో( RAJYA SABHA)  ప్రవేశపెట్టబడింది. అదే రోజున రాజ్యసభ కూడా ఆమోదించింది.


ఒక వ్యక్తి పేరు మీద ఒక సిమ్( SIM)  మాత్రమే ఉండాలి. కాదంటే..మొదటి తప్పుకి 50వేలు..అదే రెండో సారి మాత్రం 2 లక్షలు ఫైన్ కట్టాల్సిందే. ప్రూఫ్ లేకుండా సిమ్ కార్డును పొందినట్లయితే చర్యలు తప్పవు. తప్పుడు ధ్రువపత్రాలతో సిమ్‌ కార్డు పొందినట్లు తేలితే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు