Redmi Note 13Pro: అద్భుత కెమెరాతో రెడ్మీ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్.! 2024-06-25 08:44:31

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్స్ ఉన్నాయి.  ఇందులో అద్భుత క్వాలిటీతో దూసుకుపోతున్న మొబైల్ రెడ్మీ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే పలు రకాల వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి.   తాజాగా రెడ్మి 13  ప్రో స్కార్లెట్ రెడ్ ఎడిషన్ ఇండియాలో లాంచ్ అయింది. అయితే ఈ మొబైల్ ను వారం రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది.

ఈ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే. 6.67 అంగుళాల 1.5కు 120Hz Oled డిస్ప్లే కలిగి ఉంది. అంతేకాకుండా స్నాప్ డ్రాగన్  7s Gen 2 Soc పై ఆధారపడి, సాంసంగ్  ఐసో సెల్ Hp3 OLS, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా అలాగే 2 ఎంపీ మాక్రో కెమెరాతో కూడినటువంటి 200ఎంపీ వెనుక కెమెరా కలిగి ఉంది.16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14తో ప్రారంభించబడింది.

అలాగే ఈ మొబైల్ దుమ్ము నీటి నిరోధకత కోసం  IP54 రేటింగ్ కలిగి ఉంది. ఏజీ మాట్ గ్లాస్ బ్యాక్ కవర్ తో వస్తోంది. 67Wఫాస్ట్ ఛార్జింగ్, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ మొబైల్ ధర విషయానికొస్తే Scarlet Red Edition ధర 8జిబి ప్లస్ 128gb మోడల్ కు 24,999 8gb +256gb మోడల్ ధర  రూ:26,999 ఉంది.