Talasani: కాంగ్రెస్ ఆ హామీని నెరవేర్చాలి

దాదాపు సంవత్సరం పాటు ఎదురు చుసిన తర్వాత చాలా ఆలస్యంగా ఈరోజు చెక్కులు అందజేశామని వెల్లడించారు. పలు కారణాలతో చెక్కుల పంపిణీ ఆలస్యమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి BRS తరఫున డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తామని హామీ కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. 


Published Jun 26, 2024 12:42:07 PM
postImages/2024-06-26/1719385927_Untitleddesign15.jpg

న్యూస్ లైన్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల(assembly elections) సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం(congress government) పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, సనత్ నగర్ BRS ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas yadav) డిమాండ్ చేశారు. బుధవారం సికింద్రాబాద్(secundrabad)లోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్బంగా 159 మంది లబ్దిదారులు చెక్కులు అందుకున్నారు. 

ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. దాదాపు సంవత్సరం పాటు ఎదురు చుసిన తర్వాత చాలా ఆలస్యంగా ఈరోజు చెక్కులు అందజేశామని వెల్లడించారు. పలు కారణాలతో చెక్కుల పంపిణీ ఆలస్యమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి BRS తరఫున డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తామని హామీ కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం తులం బంగారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

పేద, మధ్య తరగతి కుటుంబాల మేలు కోసమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి వాటిని గత BRS ప్రభుత్వం అమలు చేసిందని తలసాని వివరించారు. ఆడబిడ్డ కుటుంబాల్లో పెళ్లిళ్లు జరిగే సమయంలో చాలా రకాల ఆర్ధిక ఇబ్బందులు వస్తాయని ఆయన తెలిపారు. వచ్చే కొత్త అల్లుడు బంగారం, మోటార్ సైకిల్ వంటివి కావాలని డిమాండ్ చేస్తాడు. అలంటి సమయంలో తల్లిదండ్రులకు చేతనైనంత ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మరికొంత ఆర్ధిక సహాయాన్ని అందించాలనే ఆలోచనతోనే మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్(KCR) కల్యాణ లక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారని తలసాని వెల్లడించారు. అందుకే అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

newsline-whatsapp-channel
Tags : kcr telangana ts-news revanth-reddy news-line newslinetelugu tspolitics ktr telanganam talasani-srinivas-yadav gold

Related Articles