Praja Bhavan : ప్రజాదర్బార్ ... పీఆర్ స్టంట్ల కోసమే

 ప్రజాదర్బార్ వేస్ట్ ప్రజా దర్బార్, వాళ్ల కోసం, వాళ్ల పీఆర్ స్టంట్ల కోసం పెట్టుకున్న దర్బార్ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.


Published Jun 25, 2024 04:49:10 AM
postImages/2024-06-25/1719308852_5.jpeg

న్యూస్ లైన్ డెస్క్ : ప్రజాదర్బార్ లో ప్రజల సమస్యల పరిష్కారం అనేది ఉత్త ముచ్చటే అని పాండు అనే యువకుడు అన్నాడు. తాను చేవెళ్ల నుంచి  వచ్చానని తెలిపాడు. ఇంతకు ముందు కలెక్టర్ ఆఫీసులో 74 కాపీలు ఇచ్చాను,   7వ సారి ప్రజాదర్బార్ (Prajadarbar) కి వచ్చానని, నేను తెచ్చిన వినతి పత్రంలో ఒక్క అక్షరం మార్చలేదు.  ఇంతవరకు తన సమస్యకి పరిష్కారం దొరలేదని అన్నాడు.  


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తానే స్వయంగా ప్రజా దర్బార్ లో పాల్గొంటానని చెప్పారు కానీ అదంతా ఉత్త ముచ్చటే అని అతను అన్నాడు. కనీసం  ఉపముఖ్యమంత్రి కూడా తమ సమస్యలు వినడం లేదని అన్నారు. అక్కడ ఎవ్వరు ఉండరు. ఫైల్స్ తీసుకుని అధికారులకు, కలెక్టర్ (Collector)కి పంపుతున్నామని అంటున్నారని వాపోయాడు. ప్రజాదర్బార్ వేస్ట్ ప్రజా దర్బార్, వాళ్ల కోసం, వాళ్ల పీఆర్ స్టంట్ల కోసం పెట్టుకున్న దర్బార్ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదువుకున్న తన పరిస్థితే ఇలా ఉంటే ఇక ఊర్ల నుంచి వచ్చిన పెద్దగా చదువు లేని వృద్ధుల ఎలా ఉంటుందో ఆలోచించండి అని అన్నాడు.

ప్రజా దర్బార్‌లో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సీఎం రుజువు చేస్తే తాను ఖచ్చితంగా అసెంబ్లీ ముందు మూడు రోజుల లోపల ఉరి వేసుకుంటానని సవాల్ విసిరాడు. తన దగ్గర రూ.  మాత్రమే మిగిలాయని ఇపుడు చేవెళ్ల ఎలా వెళ్లాలి అని ప్రశ్నించాడు. లేడీస్ కి ఫ్రీ బస్ ఇచ్చారు, మాకు ఫ్రీ బస్ ఇవ్వండి రోజూ వస్తాం అని ఎద్దేవా చేశాడు. మాకు వందకు వంత శాతం ప్రజాదర్బార్ మీద నమ్మకం లేదని తేల్చి చెప్పాడు. ఇది తన ఒక్కడి సమస్య మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇలాగే బాధపడుతున్నారని ఆయన చెప్పాడు. 

newsline-whatsapp-channel
Tags : collectors cm-revanth-reddy prajadarbar assembly

Related Articles