KCR: బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు 2024-06-23 17:45:55

న్యూస్ లైన్ డెస్క్: రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు. అలాగే పార్టీ విప్ గా ఎంపీ దివకొండ దామోదర్ రావును నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు ఆదివారం బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ లేఖ రాసారు. కాగా, ఇటీవల రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా సీనియర్ లీడర్ కే.ఆర్ సురేశ్‌రెడ్డిని కేసీఆర్ నియమించారు. పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభ పక్షనేతగా ఉన్న కే. కేశవరావు స్థానంలో సురేశ్‌రెడ్డిని నియమించారు. కేకే బీఆర్‌ఎస్‌ పార్టీకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన స్థానంలో సురేశ్‌రెడ్డికి భాద్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.