Srinivas Goud: చర్చలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలి

Published 2024-07-04 18:48:22

postImages/2024-07-04/1720099102_srinivasgoud.jfif

న్యూస్ లైన్ డెస్క్: ఉమ్మడి రాజధానికి పది సంవత్సరాలు అయిపోయిందని, ఎల్లుండి జరుగబోయే ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేయడం సంతోషకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోనే సమావేశాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, మరో సమావేశం ఉంటే సచివాలయంలో పెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని, ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలకమైన వ్యక్తి   విభజన సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్ తరఫున కోరారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సహచరులు కాబట్టి విభజన అంశాలు కొలిక్కి వస్తాయని, అందరూ అనుకుంటున్నారన్నారు. భద్రాచలంలో పార్కింగ్ పెడుతామంటే స్థలం లేదు, డంపింగ్ యార్డ్‌కు స్థలం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే 7 మండలాలను ఆంధ్రలో కలిపారని, ఆ మండలాలను ఆంధ్రలో కలిపితే తప్ప తను బాధ్యతలు తీసుకొను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అలాంటిది ఇప్పుడు అయిన మా మండలాలను తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా నది, గోదావరి నదులపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని, రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఇతర రాష్ట్రాల నుండి రావాల్సిన వాటాపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. గతంలో బీజేపీ రాష్ట్ర విభజన ఏర్పాటును తప్పుని అన్నది, చీకట్లో విభజన చేశారని, తలుపులు పెట్టి రాష్ట్రాన్ని విడదీశారని అన్నారని గుర్తు చేశారు. అలాంటి మాటలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, చాలా కార్పొరేషన్ల ఆదాయం తింటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. 


అప్పులు కట్టడం లేదు, జిల్లా కార్యాలయాలలో కూడా ఏపీకి వాటా ఉందని వితండవాదం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఆస్తుల విషయంలో ఆర్టీసీ, దిల్ వంటి సంస్థలపై విభజన హామీలు అమలు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ చుట్టు పక్కల చాలా ఆస్తులు ఉన్నాయిని, వీటి విలువ ఎక్కువ కాబట్టి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విటిని కాపాడుకోవాలని దిల్ అనే సంస్థ 5000 ఎకరాల భూమిపైన ఏపీ కన్ను వేసిందని, ఏపీ పునర్విభజన 2014 చట్టం ప్రకారం సవరణలు చేయాలన్నారు. విద్యుత్ సంస్థల బకాయిలు వస్తాయని ఏపీ అడుగుతుంది, ప్రపంచం మొత్తం తెలుసు హైదరాబాద్ భవనం అంటే హైదరాబాద్ భవన్ తీసుకొని తెలంగాణ భవన్ ఇచ్చారన్నారు. వారసత్వం కింద వచ్చిన తెలంగాణ భవన్‌లో కూడా వాటా అడుగుతున్నారని విమర్శించారు. సింగరేణిపై కూడా ఏపీ కన్ను వేసిందని, సింగరేణి అనుబంధ సంస్థలు విజయవాడలో ఉన్నందుకు వాటా అడుగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఎంతో ఆస్తి ఎన్నో పట్టణాల్లో కొన్నది, కానీ తెలంగాణ వాటా అడగలేదు 23 సంస్థలపై ఏపీ ప్రభుత్వం వాటా వస్తుందని అడుగుతుందన్నారు. 100 ఎకరాల భూములపై ఏపీ కన్ను వేసింది 9, 10 షెడ్యూల్ ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రానికి చెందుతాయని చెప్తుంది. సమస్యలు శాశ్వత పరిష్కారం చేసుకోవాలని తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య మళ్ళీ విభేదాలు లేకుండా ఈ సమావేశం కొనసాగాలన్నారు. విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.