JIO: బాయ్ కాట్ జియో...ముఖేష్ అంబానీపై ఫైర్ అవుతున్న నెటిజన్లు ..ఎందుకు ?

ఏదో సామెత చెప్పినట్లు ...మప్పితే ...తిప్పక తప్పదు ..ఇది విన్నారా...అంటే అలవాటైతే ...వాడు ఏం చెప్పినా చెయ్యాలి ...ఇది కరెక్ట్ గా సరిపోతుంది జియో యాజమాన్యానికి ...అసలు 1 జీబీతో నెలంతా హ్యాపీ గా బతికేవాళ్లం..ఇప్పుడు రోజు కు ఎంత జీబీ వాడుతున్నామో కూడా తెలీదు..విచ్చలవిడిగా వాడేస్తున్నాం. ఇదంతా ముఖేష్ అంబానీ దయ వల్లే...తక్కువ రేటుకు అలవాటు చేశారు...ఫ్రీ కాల్స్ ..ఫ్రీ నెట్ అలవాటు చేశారు..ఇప్పుడు రీఛార్జ్ లు పేలగొడుతున్నారు.


Published Jul 07, 2024 10:57:00 AM
postImages/2024-07-07/1720330136_Jiosaffordablerechargeplan1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏదో సామెత చెప్పినట్లు ...మప్పితే ...తిప్పక తప్పదు ..ఇది విన్నారా...అంటే అలవాటైతే ...వాడు ఏం చెప్పినా చెయ్యాలి ...ఇది కరెక్ట్ గా సరిపోతుంది జియో యాజమాన్యానికి ...అసలు 1 జీబీతో నెలంతా హ్యాపీ గా బతికేవాళ్లం..ఇప్పుడు రోజు కు ఎంత జీబీ వాడుతున్నామో కూడా తెలీదు..విచ్చలవిడిగా వాడేస్తున్నాం. ఇదంతా ముఖేష్ అంబానీ దయ వల్లే...తక్కువ రేటుకు అలవాటు చేశారు...ఫ్రీ కాల్స్ ..ఫ్రీ నెట్ అలవాటు చేశారు..ఇప్పుడు రీఛార్జ్ లు పేలగొడుతున్నారు.
నెలకు మినిమమ్ తక్కువలో తక్కువ 400 వందలు కావాల్సిందే. లేకపోతే పని కాదు. అలా అని నెల అంటే 30 రోజులు కాదు ..వీళ్లకి జస్ట్ 28 రోజులే ఒక నెల ...ప్రతి నెల లీప్ ఇయర్ లాగా.. ప్రతి నెల 28 రోజులకే రిఛార్జ్ అయిపోతుంది. దీనికి తోడు మళ్లీ రీఛార్జ్ లు పెంచారు. అసలు జియో ఎంప్లాయిస్ జీతాలు పెంచుతున్నారో లేదో కాని ముఖేష్ అంబానీ టెన్షన్ గా జియో రీఛార్జ్ లు మాత్రం పెంచుతున్నారు. 


ముఖేష్ అంబానీ జియో రీఛార్జ్ లు పెంచడం ఫై ఫుల్ ఫైర్ లో ఉన్నారు జనాలు. " బాయ్ కాట్ జియో"  అంటూ సోషల్ మీడియా అంతా ఊదరగొట్టేస్తున్నారు నెటిజన్లు. అయితే రీఛార్జ్ లు రేట్లు పెంచేసి ...తన పిల్లల పెళ్లిళ్లు ...వేల కోట్లతో చేస్తున్నాడని ఫుల్ ఫైర్ అయిపోయారు. అయితే తన చిన్న కొడుకు పెళ్లి వస్తుందిగా ..ఈ మాత్రం ఖర్చులు ఉండవా ఏంటి...అని అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. 


కాని ఈ సారి నార్త్ జనాలకు ...జియో పై చాలా కోపం వచ్చేసింది...లేదంటే ఎప్పుడు లేనిది సెలబ్రెటీ...ముఖేష్ పై కామెంట్లు చేస్తున్నారు.  తన కొడుకు పెళ్లి వస్తుందిగా డబ్బులు లేక రీఛార్జ్ రేట్లు పెంచారని కామెంట్లు చేస్తున్నారు. ఇంతేనా ...రతన్ టాటా గారిని ఓ సారి టాటా డొకోమో...మళ్లీ తీసుకురావాలని కూడా కోరుతున్నారు. ఇంత ఛార్జీలు భరించలేమని...టాటా మాత్రమే ఈ ఇబ్బంది నుంచి బయటపడేయగలరని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu business

Related Articles