దాదాపు దశాబ్ద కాలం కిందట ఎక్కువ అబ్బాయిలే ఒకటి, రెండు పెళ్లిళ్లు అంతకంటే ఎక్కువ చేసుకునేవారు. ప్రస్తుతం కాలం మారిపోయింది. అబ్బాయిలకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడమే కష్టంగా మారింది. ప్రతి 1000 మంది అబ్బాయిలకు, 750 నుంచి 800 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఈ విధంగా అమ్మాయిల కొరత ఏర్పడడంతో పెళ్ళికాని ప్రసాద్ లను టార్గెట్ చేస్తూ కొంత మంది లేడీస్ "కీ'లేడీస్ గా మారుతున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మహిళ.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. చక్కగా కనిపిస్తున్నటువంటి ఈ మహిళ చూడటానికి ఎంతో అమాయకురాలిగా ఉంటుంది.
న్యూస్ లైన్ డెస్క్: దాదాపు దశాబ్ద కాలం కిందట ఎక్కువ అబ్బాయిలే ఒకటి, రెండు పెళ్లిళ్లు అంతకంటే ఎక్కువ చేసుకునేవారు. ప్రస్తుతం కాలం మారిపోయింది. అబ్బాయిలకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడమే కష్టంగా మారింది. ప్రతి 1000 మంది అబ్బాయిలకు, 750 నుంచి 800 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఈ విధంగా అమ్మాయిల కొరత ఏర్పడడంతో పెళ్ళికాని ప్రసాద్ లను టార్గెట్ చేస్తూ కొంత మంది లేడీస్ "కీ'లేడీస్ గా మారుతున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మహిళ.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. చక్కగా కనిపిస్తున్నటువంటి ఈ మహిళ చూడటానికి ఎంతో అమాయకురాలిగా ఉంటుంది.
కానీ ఈమె పెళ్లిళ్లు చేసుకొని వారి దగ్గర ఉన్న సొత్తు దోచుకుని పారిపోవడమే ప్రధాన టార్గెట్. ఇలా ఏకంగా 50 మందిని బురిడీ కొట్టించింది. ఇందులో అన్ని తెలిసిన డీఎస్పీ అధికారి కూడా ఉన్నారు. ఈయనే మోసపోయారంటే మామూలు జనం పరిస్థితి ఇలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంతకీ అమ్మాయి పేరు ఏంటయ్యా అంటే సంధ్య. తమిళనాడు రాష్ట్రంలోని తిరువూరుకు చెందినటువంటి ఒక అబ్బాయికి 35 సంవత్సరాలు వచ్చిన వివాహం అవ్వకపోవడంతో 'డేట్ ద తమిళ్ వే' అనే వెబ్సైట్ ద్వారా సంధ్యా అనే మహిళను చూశాడు. అంతేకాదు ఆమె నెంబర్ తీసుకుని ఫోన్ చేసి పెళ్లి కూడా చేసుకున్నాడు.
పెళ్లి జరిగిన మూడు నెలల దాకా ఆమె అమాయకురాలిగానే నటించింది. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పులు రావడంతో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో వేరే భర్త పేరు ఉంది. సంధ్యను ఏంటని ప్రశ్నించగా నిన్ను చంపేస్తానని బెదిరింపులకు గురి చేసింది. చివరికి మరింత అనుమానం పెంచుకున్న ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ చేపడితే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.
ఆమె పెళ్లి చేసుకున్న లిస్టులో ఒక డీఎస్పీ స్థాయి అధికారి, మరో పోలీస్ ఇన్స్పెక్టర్, మధురైలో మరో పోలీసు అధికారి, కరూర్ లో ఒక ఫైనాన్స్ వ్యక్తితో పాటు 50 మందికి పైగా పెళ్ళికొడుకులను మార్చిందట. ఎవరిని చేసుకున్నా కొన్నాళ్లపాటు ఉండడం వారి దగ్గర ఉన్న సొమ్మంతా దోచుకోవడం బయటపడడం. ఇలా సంధ్య ప్రొపేషనే పెళ్లిళ్లు చేసుకోవడంగా మారిపోయింది. చివరికి పోలీసులకు దొరికిపోయి బిత్తర చూపులు చూస్తోంది. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.