శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవిపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవిపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షానికి పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ పదవి అరికపూడి గాంధీకి ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు. పీఏసీ బాధ్యతలు ప్రతిపక్ష నాయకులకు ఇస్తారని, కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీకి పీఎసీ ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పీఎసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.