ఆమెపై హైదరాబాద్ లో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఒడిశా పోలీసుల సహకారంతో ఆమెను అదుపులోకి తీసుకొని నగరానికి తరలించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గంజాయి సరఫరా కేసుల్లో నిందితురాలు , గంజాయి లేడీ డాన్ సంగీత సాహును ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలసులు అరెస్ట్ చేశారు. ఆమెపై హైదరాబాద్ లో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఒడిశా పోలీసుల సహకారంతో ఆమెను అదుపులోకి తీసుకొని నగరానికి తరలించారు.
ఒడిశాలో కుర్దా జిల్లా , కాళీకోట్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆమె దాదాపు నాలుగేళ్ల క్రితం గంజా వ్యాపారంలోకి వచ్చింది. వివిధ రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో సంబంధాలు నెరుపుతూ వారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లోని దూల్పేటలో ఇద్దరు వ్యక్తులకు 41.3 కిలోల గంజాయిని సరఫరా చేస్తూ పట్టుబడింది. అయితే సంగీత సాహు ఇన్స్ స్టాగ్రామ్ లో సినీ నటిలా వీడియోలు పోస్టు చేస్తుందని పోలీసులు పేర్కొన్నారు. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఆమెను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు.