ఏడాది క్రితం మహేశ్‌ను భార్య వదిలేసింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న మహేష్ గంజాయికి బానిసయ్యాడు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కదులుతున్న ఎమ్ ఎమ్ టీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసును దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించారు. నిందితుడు మేడ్చల్ జిల్లా గౌడవల్లి వాసి జంగం మహేశ్ గా గుర్తించగా ఆ ఫొటో ను బాధితురాలికి చూపించారు. అతడేనని గుర్తించారు.
28 కిలోమీటర్ల మేర పరిశీలించిన సీసీ కెమరాలు పరిశీలించిన తర్వాత మహేష్ గా గుర్తించారు. ఏడాది క్రితం మహేశ్‌ను భార్య వదిలేసింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న మహేష్ గంజాయికి బానిసయ్యాడు. ప్రస్తుతం మహేశ్ పోలీసులు అదుపులో ఉన్నారు. అనంతపురం జిల్లా కు చెందిన యువతి నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంది అయితే మేడ్చల్ హాస్టల్ లో ఉంటున్న యువతి ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ కు వచ్చింది. ఫోన్ రిపేర్ అయిపోగానే ..తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చి రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మేడ్చల్ కు ఎమ్ ఎమ్ టీఎస్ లేడీస్ బోగీలో ఎక్కింది.
అప్పటికే ఆ బోగీలో ప్రయాణిస్తున్న మహిళలు 8.15 గంటల సమయంలో అల్వాల్ స్టేషన్ రాగానే దిగిపోయారు.దీంతో బోగీలో యువతి ఒక్కరే ఉన్నారు. దీంతో ఆగంతకుడు యువత దగ్గరకు వెళ్లి తన లైంగిక వాంఛ తీర్చాలంటూ శరీరాన్ని తాకుతూ పట్టుకోవడానికి ప్రయత్నించగా యువతి భయపడి బయటకు దూకేసింది. తీవ్రగాయాలతో పట్టాలపై పడి ఉన్న యువతిని గుర్తించిన స్థానికులు 108 డయల్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు నిందితుని గుర్తించారు.