ఈ మ్యాచ్ టికెట్లను ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో టికెట్స్ జస్ట్ సెకన్స్ లో అమ్ముడయిపోతున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ సీజన్ శనివారం మొదలవుతుంది. ఆదివారం జరిగే రెండో మ్యాచ్ కోసం రెండు జట్ల అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాలని ఆవపడుతున్నారు. ఈ మ్యాచ్ టికెట్లను ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో టికెట్స్ జస్ట్ సెకన్స్ లో అమ్ముడయిపోతున్నాయి.
అయితే ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. వాటిని బ్లాక్ లో అమ్ముతూ పోలీసులకు చిక్కారు.శనివారం ఉప్పల్ మెట్రో వద్ద భరద్వాజ్ అనే యువకుడు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భదద్వాజ్ ను అరెస్ట్ చేసి, అతడి వద్ద ఉన్న నాలుగు టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. భరద్వాజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.