Harish Rao: ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న హరీష్ రావు 

ఖైరతాబాద్ వినాయకుడికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఖైరతాబాద్ గణేష్ మహరాజ్‌ను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.


Published Sep 15, 2024 03:52:13 PM
postImages/2024-09-15/1726395733_harish22.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఖైరతాబాద్ వినాయకుడికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఖైరతాబాద్ గణేష్ మహరాజ్‌ను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పూర్వజన్మ సుక్రుతంగా భావిస్తున్నానని, ఇసుకేస్తే రాలనంత జనం వచ్చిందని తెలిపారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రమంతా ఇక్కడే ఉన్నట్లు ఉందన్నారు. 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత నిర్వాహకులకు దక్కుతుందని అన్నారు. వారి కృషికి, ఇన్నేండ్లుగా ఘనంగా నిర్వహిస్తున్న వారికి నా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

భిన్నత్వంలో ఏకత్వం మన భారత సంస్కృతి, అవసరమైనప్పుడు అందరం ఒక్కటవుతామని ఈ సందర్భంగా హరీష్ రావు అన్నారు. అన్ని పండుగలు సామూహికంగా సంతోషంగా కలిసి నిర్వహించుకుంటామని, అంత గొప్ప సంస్కృతి మనదని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇది కొనసాగించాలని, రాబోయే తరాలకు అందించాలన్నారు. వినాయక చవితి అంటే డెవోషన్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా ఉందన్నారు. అందరి ఐకమత్యాన్ని చాటేందుకు బాల గంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర్యోద్యమం సమయంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించారని, అదే స్పూర్తిని ఇంకా కొనసాగిస్తున్నాం. రోబోయే రోజుల్లో కొనసాగిద్దామని తెలిపారు. 

మొన్నటి వర్షాలకు కొన్ని జిల్లాల్లో బీభత్సం జరిగిందని, ఆ ప్రజలందరి కష్టాలు తొలగిపోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరి విఘ్నాలు తొలిగి, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ గణపతిని రెండు చేతులు జోడించి ప్రార్థించనాని తెలిపారు. 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు కూడా అదే పద్దతిలో నిమజ్జన కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు కోరారు.


 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs harish-rao khairtabad ganesh-chathurdhi

Related Articles