Sunitha Reddy: జూనియర్ ఎమ్మెల్యేల మాటలు బాధించాయి

శాసనసభలో తమకు జరిగిన అవమానం భాధాకరం అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు.


Published Aug 01, 2024 07:57:29 AM
postImages/2024-08-01/1722516913_mlasunitha.PNG

న్యూస్ లైన్ డెస్క్: శాసనసభలో తమకు జరిగిన అవమానం భాధాకరం అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. నాలుగున్నర గంటలు సభలో మేము నిల్చున్నా పాలకపక్షం స్పందించకపోగా హేళన చేసిందని, జూనియర్ ఎమ్మెల్యేల మాటలు బాధించాయి అన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిపోయాయి.. శాంతి భద్రతలు దిగజారాయి అన్నారు. తన ప్రచారానికి వస్తే కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన ప్రసంగాల వల్ల తన మీదనే మూడు కేసులు నమోదయ్యాయి అని ఆమె గుర్తు చేశారు. 

సీఎం రేవంత్ సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కూడా తమా మీద సీఎం రేవంత్ ఏదేదో మాట్లాడారని, తమాకు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు తము వ్యతిరేకం అన్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగజారి మాట్లాడారని మండిపడ్డారు. స్పీకర్ రేపైనా తమాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సునీత రెడ్డి డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress cm-revanth-reddy assembly

Related Articles