KTR: జిట్టా దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.


Published Sep 15, 2024 03:38:04 PM
postImages/2024-09-15/1726394884_ktr1.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ జిట్టా బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని ఓదార్చారు. 

ఈ సందర్భంగా జిట్టాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న జిట్టా బాలకృష్ణారెడ్డి లేరన్న వార్త నమ్మలేకపోతున్నానని కేటీఆర్ అన్నారు. జిట్టా కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs ktr balakrishna

Related Articles