ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకురవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకురవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని అన్నారు. అనేకసార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈసారి అయినా సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తెప్పించండని, కేంద్ర మంత్రిగా తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయన్ని కేటీఆర్ తెలిపారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలకుల వైఫల్యం వల్ల సంక్షోభంలో చేనేత రంగం ఉందన్నారు. నేతన్నలను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు గుడ్ న్యూస్ వచ్చేలా చూడాలని బండి సంజయ్‌కు కేటీఆర్ కోరారు.