GOLD:పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం , పెరిగిన వెండి ?

బంగారం కొనాలంటే మధ్యతరగతి వారికి అసలు అందుబాటులో లేదు. అయితే ఈ రోజు మాత్రం బంగారం ధర తగ్గింది.


Published Aug 20, 2024 09:04:00 AM
postImages/2024-08-20/1724124883_Amuavang28QuynhTran171099564029611710995658.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శ్రావణమాసం వచ్చేసింది. పట్టుచీరలు, పెళ్లిళ్లు , పూజలు ఇలా సవాలక్ష వ్యవహారాలుంటాయి. రీసెంట్ గా గోల్డ్ రేటు కంటిన్యూస్ గా పెరుగుతూ ..తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనాలంటే మధ్యతరగతి వారికి అసలు అందుబాటులో లేదు. అయితే ఈ రోజు మాత్రం బంగారం ధర తగ్గింది.


గతనెల పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ లో భాగంగా...దిగిమతి అయ్యే పసిడిపై సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపారు. అంతే మరుసటి రోజు పసిడి ధరలు భారీగా దిగి వచ్చాయి. రాఖీ పండుగ సందర్భంగా కాస్త దిగి వచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, 66,690 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, 72,760వద్ద కొనసాగుతుంది. దాదాపుగా బంగారం ధర నిన్నటి మీద తులానికి  వందరూపాయిలు పెరిగి 72 వేల 760 రూపాయిలుగా నమోదయ్యింది.

* దేశంలోని ప్రధాన నగరాలు ఢీల్లీలో ఇదే రేట్లు నమోదవుతున్నాయి. 
* ముంబై, పూనె, కేరళా, బెంగుళూరు, కోల్‌కొతాలోను ఇలానే ఉన్నాయి.
 తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 90,900 ఉండగా, ఢిల్లీ, కోల్‌కొతా, జైపూర్, పూణే లో కిలో వెండి ధర రూ. 85,900 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో మాత్రం వెండి ధర 84వేల 800 గా నమోదయ్యింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles