Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో పసిడిధరలు ఎలా ఉన్నాయంటే ?

ఆగస్టు 17న ఉన్న ధరలతో పోల్చినే ఆగస్టు 18న మాత్రం భారీగా పెరిగాయి. ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి.


Published Aug 19, 2024 07:52:00 AM
postImages/2024-08-19/1724034189_gold.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం , వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి.గత నెలలో కాస్త బంగారం ధర తగ్గింది. ఇప్పుడు మళ్లీ రేట్లు జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. ఆగస్టు 17న ఉన్న ధరలతో పోల్చినే ఆగస్టు 18న మాత్రం భారీగా పెరిగాయి. ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి.


ఆగస్టు 19వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి రూ.72,760 గా ఉంది. అంటే నిన్నటికి ఈ రోజుకు తులం బంగారం ధరను పరిశీలిస్తే రూ.10 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 వద్ద ఉంది. తగ్గితే పది, ఐదు తగ్గుతుంది. పెరగడం మాత్రం వందలు , వేలు పెరుగుతుంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 గా ఉంది. గ్రాము బంగారం ధర6,485 రూపాయిలు ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,910 ఉంది.


ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 ఉంది.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 ఉంది.దాదాపు తెలుగు రాష్ట్రాలన్నింటిలోను ఇదే ధర నడుస్తుంది. దేశంలో వెండి ధరలు నిన్న 86,100గా ఉండగా, ప్రస్తుతం 85,900 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటికి ఇప్పటికి వెండి ధర కాస్త తగ్గింది. అంటే రూ.100 మేరకు పడిపోయింది. హైదరాబాద్‌, కేరళ, చెన్నైలలో రూ.90,900గా ఉంది. 100 తక్కువ కాని అక్షరాల లక్ష రూపాయిలు నడుస్తుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles