Kalki: కల్కి టికెట్ల ధర పెంపుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

 వారంలో రోజుకు ఐదు షోలు ఆడతాయి. వీటికి మాత్రమే పెరిగిన ధరలు వర్తిస్తాయి. 


Published Jun 23, 2024 01:07:38 PM
postImages/2024-06-23/1719128258_kalki2898adet004021901718885336.avif

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో కల్కి2898 AD(Kalki 2898 AD) సినిమా టికెట్ల ధర పెంచేందుకు ప్రభుత్వం(government) అనుమతి ఇచ్చింది. అయితే, 8 రోజుల పాటు మాత్రమే టికెట్ల ధరలను పెంచాలని సూచించింది. ఈనెల 27 నుంచి జూలై 4 వరకు మాత్రమే పెరిగిన టికెట్ల ధరలు అమల్లో ఉండనున్నాయి. వారంలో రోజుకు ఐదు షోలు ఆడతాయి. వీటికి మాత్రమే పెరిగిన ధరలు వర్తిస్తాయి. అయితే, గురువారం రోజున తెల్లవారుజామున 5:30కి బెనిఫిట్ షో(benefit show) వేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. సాధారణ థియేటర్లలో టికెట్‌పై రూ.75 పెరగనుండగా.. మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే, ఈ సినిమాను రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడంతో టికెట్ల ధరలను పెంచాలని చిత్ర బృందం ప్రభుత్వాన్ని కోరింది. 

కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో కపించనున్న చిత్రం కల్కి2898 AD. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్‌తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో.. సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్(deepika padukone) ఫిమేల్ లీడ్(female lead)లో కనిపించనుండగా.. ఇతర భాషలకు చెందిన స్టార్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line telanganam viral-news kalki kalki-tickets cost-raise nagashwin

Related Articles